రంజిత్‌ రెడ్డి గుట్టు హస్తంకెరుక..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రంజిత్‌ రెడ్డి గుట్టు హస్తంకెరుక..!
– సొంత పార్టీ నేతలే విమర్శించారు
– డబ్బు, మద్యం ఇస్తే గెలవలేరు
– రంజిత్‌ రెడ్డిపై కొండా వాఖ్యలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అవినీతి స్కాంలు చేసిన ఇమేజ్ రంజిత్ రెడ్డికే ఉందని బీజేపీ చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చురుకైన వాఖ్యలు చేశారు. మంగళవారం వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో జరిగిన బీజేపీ కార్యకర్తలు, బూతు స్థాయి నేతలతో జరిగిన సమావేశంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం కొండా మీడియాతో మాట్లాడారు. ఈ సారి కూడా రంజిత్ రెడ్డిపై పదునైన వాఖ్యలు చేశారు. గుడ్లు, మక్కలు స్కాంలు చేసిందే ఆయననే అన్నారు. ఆయన అవినీతిపై కాంగ్రెస్ నేతలే విమర్శించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు.

అసెంబ్లీ సాక్షింగా కోడిపుంజును ఉంచుకుని ఆరోపణలు కూడా చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా రంజిత్ రెడ్డి స్కాంలు తెలుసు అని అన్నారు. ఇలా సొంత పార్టీ నేతలే విమర్శించే కీర్తి రంజిత్ రెడ్డికి ఉందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు డబ్బు, మద్యం పంపిణీ చేసేందుకు సిద్దమవుతున్నారని, ఈ ప్లాన్ వర్కవుట్ కాదన్నారు. ప్రజలు డబ్బు, మద్యం తీసుకున్నా బీజేపీకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు దేశంలో మోడీకి, రాహుల్ గాంధీకి పోటే లేదన్నారు. దేశంలో మోడి, బీజేపీ నేతలు అత్యధిక స్థానాల్లో గెలవడం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగారం నర్సింలు, మనోహర్ రావు, బాలి శికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, ఎంపీపీ బాలేశ్వర్ గుప్త. మాజీ కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, నాయకలు గాజుల శాంతుకుమార్, పటేల్ విజయ్ కుమార్, ఎంపీటీసీ పొయిరెడ్డి. బీరప్ప, బొప్పి శ్రీహరి, జిల్లా అధికారి ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, వివిధ గ్రామాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కమలం గెలుపుకు కసిగా పనిచేయండి