ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సినిమా

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్
– జన‌వ‌రి 7ను ఫైన‌ల్ చేసిన చిత్ర బృందం
ద‌ర్శిని బ్యూరో: రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్‌ చిత్రం ‘RRR’ (రౌద్రం రణం రుధిరం) రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసేశారు. వ‌చ్చే యేడాది జ‌న‌వ‌రి 7వ తేదినీ ఫైన‌ల్ చేసిన‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. కొవిడ్‌ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతోన్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా అక్టోబరు 13కి వాయిదా పడింది. పరిస్థితులు ఇంకా పూర్తిస్థాయిలో చక్కబడకపోవడం, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నామంటూ చిత్ర బృందం ప్రకటించడంతో అభిమానులకి నిరాశ ఎదురైంది. తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశామ‌ని చిత్ర బృందం శుభవార్తని వినిపించింది. పాన్‌ ఇండియన్‌ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియాభట్‌ ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌ సన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ కీలకపాత్రలు పోషించారు.