చికిత్స పొందుతూ పునీత్ రాజ్ క‌న్నుమూత‌

జాతీయం తెలంగాణ సినిమా

చికిత్స పొందుతూ పునీత్ రాజ్ క‌న్నుమూత‌
– శోక స‌ముద్రంలో క‌న్న‌డ సీనీ ప‌రిశ్ర‌మ‌
ద‌ర్శిని బ్యూరో : క‌న్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.. శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ గుండెపోటుతో మృతి చెందారు.. ఈ విషయాన్ని విక్రమ్ ఆసుపత్రి డాక్టర్స్ అధికారికంగా ప్రకటించారు.. ఈరోజు ఉదయం జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిగా.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు..

పునీత్ మరణవార్తతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు పునీత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పునీత్ రాజ్ కుమార్ మృతి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.. ఇప్పటికే కర్ణాటకలో థియేటర్స్ మూతపడ్డాయి.ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్షిస్తున్నారు.