నమ్మించి కుచ్చుటోపి..!

క్రైం తాండూరు వికారాబాద్

నమ్మించి కుచ్చుటోపి..!
– ఆన్‌లైన్‌ మోసానికి ఫ్రెండ్స్ బలి
– రూ. 1లక్ష 60 వేలు పోగొట్టుకున్న యువకులు
– పెద్దేముల్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ అడ్వటైజ్‌మెంట్‌తో ఓ వ్యక్తి ఇద్దరు వ్యక్తులను నమ్మించి కుచ్చుటోపీ పెట్టేశాడు. ఆన్‌లైన్‌ మోసాన్ని ఆలస్యంగా గమనించిన యువకులు రూ. 1లక్షా 60 వేల నగదును పోగొట్టుకున్నారు. పెద్దేముల్ మండలంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దేముల్ ఎస్ఐ కాశీనాథ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని మారే పల్లితండాకు చెందిన బి.ప్రవీణ్ కుమార్, మన్సాన్పల్లితండాకు చెందిన శ్రీనులు తమ వ్యాపారం కోసం నెలరోజుల క్రితం శ్రీను రూ.22 లక్షలతో ఓ డీజేను కొన్నారు. విద్యుత్‌ లేకుండా డీజేను నడపడానికి ఓ పెద్ద జనరేటర్ అవసరం కావడంతో దానికోసం ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో ఫేస్ బుక్‌లో రూ. లక్షా90వేలకు జనరేటర్ పుణెలో లభిస్తుందని అడ్వటైజ్‌మెంట్‌ను చూసి అందులో ఉన్న సెల్‌: 9832264197కు కాల్ చేశారు. పుణెకు చెందిన మనీష్ రమాకాంత్ దుర్వే అనే పేరుతో ఉన్న వ్యక్తితో జనరేటర్ మొత్తానికి రూ.లక్షా 80వేలకు ఇరువురు బేరం కుదుర్చుకున్నారు. మొదటగా రూ.5వేలు, తదుపరి 10వేలు, 20వేలు, 10వేలు, 23వేలు, 18వేలు, 10వేలు, 30వేలు ఇలా పలుమార్లు మొత్తం రూ. లక్షా60వేలను మనీష్ రమాకాంత్ దుర్వే పేరిటి ఉన్న ఫోన్పే, గూగుల్ పేల ద్వారా పంపించారు. జనరేటర్ ఓ ప్రైవేట్ వాహనంలో పంపిస్తున్నానని, వాహనం బయలుదేరిందని, రెండు రోజుల్లో మీ వద్దకు వస్తుందని శ్రీను, ప్రవీణ్‌లను నమ్మించాడు.

అప్పటికి అనుమానం రావడంతో ప్రవీణ్‌, శ్రీనులు తమ బంధువులథక్ష పుణెలో సదరు వ్యక్తి పంపిన విచారణ చేయించారు. దీంతో అక్కడ జనరేటర్ షాపు లేదు, జనరేటర్ లేదు, కేవలం రింగ్ రోడ్డు మాత్రమే ఉందని బంధువులు గుర్తించారు. మళ్లీ మనీష్ రమాకాంత్ దుర్వేకు ఫోన్ చేయగా ఈనెల 26వ తేదీ మిగతా మిగతా డబ్బులు పంపించండి.. జనరేటర్ను పంపిస్తా.. వద్దంటే మీ డబ్బులు మీకు ఇస్తానని మళ్లీ నమ్మించాడు. దీంతో తాము మోస పోయామని గ్రహించిన యువకులు. స్థానిక పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!