తెలంగాణ స్ఫూర్తి కేసీఆర్
– తాండూరులో ఘనంగా జన్మదిన వేడుకలు
– కేక్ కటింగ్, అన్నదానం చేసిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన స్పూర్తి ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని తాండూరు బీఆర్ఎస్ నేతలు అన్నారు. కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు శనివారం తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే తండ్రి విఠల్ రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అనంతరం తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు ఆసుపత్రి ఆవరణలో అల్పహారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ పదేళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ ప్రజల కోసం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో కృసి చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, వరాల శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, పెద్దేముల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, బషీరాబాద్ మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి, నాయకులు చెన్ బసప్ప, పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, బీసీ సెల్ నాయకులు చంటి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

