చిన్నారులపట్ల అప్రమత్తంగా ఉండాలి
– అంగన్‌వాడి స్కూల్‌ను ప్రారంభించిన వైస్ చైర్‌పర్సన్ దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిది: చిన్నారుల పట్ల టీచర్లు అప్రమత్తంగా ఉండాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యాసంస్థలు, అంగన్‌వాడి కేంద్రాల పునఃప్రారంభం సందర్భంగా బుధవారం సాయిపూర్‌లోని 9వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ దీపా నర్సింలు అంగన్‌వాడి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో మాదిరిగా అంగన్‌వాడి కేంద్రాలలో కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. చిన్నారుల ఆరోగ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడి కేంద్రం టీచర్లు, ఏఎన్ఎంలు, ఆయాలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
