పాత తాండూరులో అర్బ‌న్ పీహెచ్‌సీ..!

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

పాత తాండూరులో అర్బ‌న్ పీహెచ్‌సీ..?
– ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్
– అండర్ బ్రిడ్జీ నిర్మాణానికి కృషి
– గ‌ల్లి గ‌ల్లికీ పైలెట్ ప‌ర్య‌ట‌న‌లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో ఆర్బ‌న్ పీహెచ్‌సీ(ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం) ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణ సమస్యల పరిష్కారం కోసం గల్లీ గల్లీకీ పైలెట్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. పాత తాండూరులో ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించేందుకు గల్లి గల్లికి పైలెట్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా పాత తాండూరుకు అర్బ‌న్ పీహెచ్‌సీ మంజూర‌య్యింద‌ని, త్వ‌ర‌లోనే ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా మిషన్ భగీరథ పథకం లో భాగంగా ఇంటింటికీ నల్ల కలెక్షన్ ఇప్పిస్తామని అన్నారు. దీంతోపాటు గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న పాత తాండూర్ అండర్ రైల్వే బ్రిడ్జి ని త్వరలోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ విశ్వ‌నాథ్ గౌడ్, మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ దీపా న‌ర్సింలు, టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయ‌కులు రాజుగౌడ్, మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, వైస్ చైర్మ‌న్ వెంక‌ట్‌రెడ్డి, నాయ‌కులు డాక్ట‌ర్ సంప‌త్‌కుమార్, ప‌ట్లోళ్ల న‌ర్సింలు, శ్రీ‌నివాస్ చారి, హ‌రిహ‌ర‌గౌడ్, కౌన్సిల‌ర్ మంకాల రాఘ‌వేంద‌ర్, యువ‌నాయ‌కులు సంతోష్ గౌడ్, సంజీవ‌రావు, గుండ‌ప్ప‌, ఎర్రం శ్రీ‌ధ‌ర్ త‌దిత‌రులు ఉన్నారు.