అవిశ్వాసం పెట్టె హక్కు మీకెక్కడిది
– జిల్లా ప్రజల విశ్వాసం పొందిన నాయకురాలు సునీతారెడ్డి
– మాజీ ఎమ్మెల్యేల ప్రోద్బలంతోనే జడ్పిటీసీలు సంతకాలు*
– ప్రమోదీని రెడ్డి బీఆర్ఎస్‌లో కొనసాగడం లేదా..?
– తాండూరులో కాంగ్రెస్ నేతల ధ్వజం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల విశ్వాసాన్ని పొంది హ్యాట్రిక్ జడ్పి చైర్ పర్సన్ గా కొనసాగుతున్న పట్నం సునీతారెడ్డి పై అవిశ్వాసం పెట్టె నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. జడ్పి చైర్ పర్సన్ పై టీఆర్ఎస్ జడ్పిటీసీలు శనివారం అవిశ్వాసం పెట్టడాన్ని బషీరాబాద్ జడ్పిటీసీ శ్రీనివాస్ రెడ్డి, తాండూరు మాజీ జడ్పిటీసీ, డీసీసీబీ డైరెక్టర్ రవిగౌడ్, బషీరాబాద్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, తాండూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ తదితరులు విలేకర్లతో మాట్లాడారు.
పట్నం కుటుంబం పదేళ్ల కిందట టీడీపీలో ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ అడ్రెస్ లేదని అన్నారు. మహేంధర్ రెడ్డి కుటుంబం టీఆర్ఎస్ లో చేరికతో ఆ పార్టీ బలోపేతం అయ్యిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో పార్టీలో పట్నం కుటుంబం మాజీ ఎమ్మెల్యేలతో అనేక అవమానాలకు గురయ్యారని, అయినా ప్రజల కోసం వాళ్ళు బాధలు భరించారని చెప్పారు. మర్పల్లిలో సునీతారెడ్డి వాహనంపై సొంతపార్టీ ఎమ్మెల్యే దాడి చేసిన బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోలేదని అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు సునీతారెడ్డి కాంగ్రెసులో చేరారని స్పష్టం చేశారు. మహేంధర్ రెడ్డి ఫ్యామిలీ ప్రజాబలం ఉన్న నాయకులని, వాళ్ళ మద్దతు ఉంటే గెలుస్తారని, లేకుంటే ఒడిపోతారని మొన్న జరిగిన ఎన్నికల్లో తేలిపోయిందని వెల్లడించారు. తమను ఓడించారని అక్కసుతోనే మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జడ్పిటీసీలపై ఒత్తిడి తీసుకువచ్చి అవిశ్వసం పెట్టించారని ఆరోపించారు.
తాండూరు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెసులో గెలిచి రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ లో చేరారని, వాళ్ళ తల్లి వికారాబాద్ జడ్పిటీసీ కాంగ్రెస్ లో గెలిచి ఈ రోజు బీఆర్ఎస్ లో ఎలా కొనసాగుతున్నారని కాంగ్రెస్ నాయకులు నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా సునీతారెడ్డి సమర్థవంతగా అవిశ్వాసాన్ని ఎదురుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వడ్డే హనుమంతు, గిరిజన నాయకులు బన్సీలాల్ ఉన్నారు.
ఇది కూడా చదవండి…

