VKB COLLECTOR

ఎస్సీ నిరుద్యోగులకు శుభవార్త

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఎస్సీ నిరుద్యోగులకు శుభవార్త
– గ్రూప్స్ ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్
– ప్రకటించిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతీ, యువకులకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించబడుతున్న వివిధ ఉద్యోగాల నియామక ప్రక్రియలో లో భాగంగా వికారాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డిగ్రీ, పిజీ. కోర్సులు పూర్తి చేసిన ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు గ్రూప్స్ లో ఉచిత కోచింగ్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వబదుతుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.

నిష్ణాతులైన అధ్యాపకులచే ప్రశాంతమైన వాతావరణంలో కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కోచింగ్ సమయంలో హాస్టల్ వసతి, భోజన సదుపాయంతో పాటు అవసరమైన స్టడీ మెటీరియల్ అందచేయబడుతిందన్నరు. జిల్లాలోని అర్హులైన ఎస్.సి. యువతీ యువకులు ఆన్లైన్ లో www.tsstudycircle.co.in నందు ధరఖాస్తు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ లో ధరఖాస్తు నమోదు చూసుకున్న అభ్యర్థులను మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుందని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9573859268కు సంప్రదించగలరని సూచించారు.

ఇది కూడా చదవండి..

సార్లు వస్తున్నారు..!