సార్ మా కుక్క పోయింది..!

క్రైం తాండూరు వికారాబాద్

సార్ మా కుక్క పోయింది..!
– వెతికి పెట్టండి ప్లీజ్
– తాండూరు పోలీసులకు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీస్టేషన్‌లో అప్పుడప్పుడు వింత కేసులు వస్తుంటాయి. పెద్ద పెద్ద పట్టణాల్లో ఇలాంటి ఫిర్యాదులు రావడం సాధారణమే. కాని చిన్న పట్టణాల్లో అరుదుగా జరుగుతుంటాయి. వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణ పోలీసులకు సార్ మా కుక్క పోయింది.. వెతికి పెట్టండీ ప్లీజ్ అంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గురువారం తెలిసింది. తాండూర్ పట్టణంలో ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న ఒక కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో మహేష్ అనే వ్యక్తి తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్ని నెలలుగా ఈ కుక్కును అపురూపంగా పెంచుకుంటున్నామని.. త్వరగా వెతికి పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేశారో లేదో ఇంకా స్పష్టత రాలేదు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!