ఐరాస మీటింగ్‌లో అదరగొట్టిన మనోడు..!

కెరీర్ తాండూరు తెలంగాణ లైఫ్-స్టైల్ వికారాబాద్

ఐరాస మీటింగ్‌లో అదరగొట్టిన మనోడు..!
– తాండూరు యువకుడి సూచనలకు అందరు ఫిదా
– అభినందిస్తున్న నిపుణులు, మేధావులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఐక్యరాజ్య సమితి(ఐరాస) సమావేశంలో వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం బషిరాబాద్‌ మండలానికి చెందిన సాయి సంపత్‌ అదరగొట్టి అతని సూచనలు అక్కడి వారినంత ఫిధా అయ్యేలా చేశాయి. స్విట్జర్‌ల్యాండ్‌లోని జెనీవాలో మార్చి 11 నుంచి 23 వరకు జరిగిన 55వ ఐక్యరాజ్యసమితి మానవ హక్కులు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో బషీరాబాద్‌ మండలం బద్లాపూర్‌కు చెందిన సాయి సంపత్‌ పాల్గొన్నారు.

రెండు వారాలపాటు ‘వాతావరణ మార్పు- ఆహార భద్రతపై ప్రభావం’ అనే అంశంపై ప్రసంగించారు. విదేశీ కలుపు మొక్కల నియంత్రణపై ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన అంశాలపై సూచనలు అందించారు. రసాయనిక మందులను ఉపయోగించడంతో నేల, నీరు, వాతావరణం కలుషితమవుతోందని వివరించి ఆకట్టుకున్నారు. సహజ పద్ధతిలో కలుపు తొలగించేందుకు, ఉపాధి హామీ పథకానికి జోడించాలని, ఎనిమిదేళ్ల పాటు ఈ విధానాన్ని అనుసరిస్తే విదేశీ కలుపు అంతరిస్తుందన్నారు. ఈ అంశంతో పాటు విద్య, రోడ్లు, రాజకీయాల అంశాలపై మాట్లాడి భేష్ అనిపించుకున్నారు.

ఎంఏ పూర్తి చేసిన సాయి సంపత్ ఓ స్వచ్ఛంద సంస్థలో ప్రతినిధిగా కొనసాగుతున్నారు. సమావేశంలో పాల్గొని తిరిగి వచ్చిన సాయిసంత్‌ను నిపుణులు, మేధావులు అభినందిస్తున్నారు.

ఇదికూడా చదవండి…

భూకైలాస్‌లో ఘనంగా శనీశ్వర పూజలు