హస్తం గూటికి సంతోష్ గౌడ్
– ఎమ్మెల్యే సమక్షంలో చేరిక
– ఆహ్వానించిన మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీకీ రాజీనామ చేసిన ఆపార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ హస్తం గూటికి చేరుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంతోష్ గౌడ్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం పనిచేయాలని ఎమ్మెల్యే సంతోష్ గౌడ్‌కు సూచించారు. అనంతరం సంతోష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆర్బీఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డిల నాయకత్వంలో పార్టీ పటిష్టత కోసం సైనికుడిలా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, ఎన్ఎన్యూఐ జిల్లా అధ్యక్షులు అంకిత్ అనురాగ్, నాయకులు జలాల్, సురేష్ నాయక్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

