పార్లమెంట్‌ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ సత్తా చూపిద్దాం

తాండూరు రాజకీయం వికారాబాద్

పార్లమెంట్‌ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ సత్తా చూపిద్దాం
– చేవేళ్ల గెలుపు ఖాతా హస్తగతం చేసేందుకు కృషి
– చేవేళ్ల పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ కృష్ణంరాజు
– తాండూరులో సన్నహాక సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ సత్తా చాటుకునే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేవేళ్ల పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ కృష్ణంరాజు అన్నారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్ ఆధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికల సన్నహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన పార్లమెంట్ ఇంచార్జ్ కృష్ణంరాజు మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనను వ్యతిరేకించిన కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి అధికారం చేపట్టిందన్నారు.

అదే ఉత్సహాంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేలా యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించాలన్నారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అందరు ముక్తకంఠంతో మోదికి హటావో దేశ్ కు బచావో అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు.

తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో మండల స్థాయి, భూత్ కమిటీ స్థాయి యువనాయకులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. చేవేళ్ల పార్లమెంట్ స్థానం హస్తగతం అయ్యేలా అందరు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, మండల అధ్యక్షులు జగదీష్ ముదిరాజ్, వెంకట్, బస్వరాజు, మండల కమిటీ బూత్ కమిటీ కార్యవర్గ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!