సేవా రంగంలో ఆర్యవైశ్యులు ముందుంటారు
– ఆర్యవైశ్య మహసభ జిల్లా అధ్యక్షులు కటకం శివకుమార్
– తాండూరులో మజ్జిగ సేవకు అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సేవారంగంలో ఆర్యవైశ్యులు ముందుంటారని ఆర్యవైశ్య మహసభ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కటకం శివకుమార్ అన్నారు. తాండూరు ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రారంభించిన మజ్జిగ, అంబలి కేంద్రాన్ని సందర్శించారు. తాండూరు ఆధ్యక్షులు భానుకుమార్‌తో కలిసి మజ్జిగ, అంబలిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కటకం శివకుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సేవా రంగంలో అందరికంటే ముందుంటారని అన్నారు. మండువేసవిలో ఆర్యవైశ్య యువజన సంఘం బాటసారులకు చేసిన సేవను అభినందించారు. యువజన సంఘం చేస్తున్న సేవకు జిల్లా మహాసభ తోడ్పాటు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం కార్యదర్శి పునీత్ కుమార్, ఆదిత్య తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

