కమలంతో కలిసి రండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కమలంతో కలిసి రండి..!
– మోడీని గెలిపించుకుందాం
– చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
– గంజ్ వ్యాపారులు, హమాలీ కార్మికులతో భేటీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : కమలంలో కలిసొచ్చి దేశ ప్రధాని మోడిని గెలిపించుకునే బాధ్యత తీసుకుందామని బీజేపీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మే వే సందర్భంగా తాండూరు పట్టణం నెహ్రు గంజ్‌లోని మార్కెట్ యార్డుకు చెందిన పలువురు వ్యాపారులు, కార్మికులతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్బంగా కొండా మాట్లాడుతూ బీజేపీ పాలనతో సుస్థిర పాలన కొనసాగుతుందన్నారు.

పేదలతో పాటు వ్యాపార, కార్మికుల సంక్షేమానికి పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం మోడి పనిచేస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బీజేపీనీ, మూడోసారి మోడిని ప్రధానిని చేసేందుకు కమలంతో కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, రాష్ట కౌన్సిల్ మెంబర్ మల్లేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారం నర్సింలు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, గౌతాపూర్ MPTC సాయి రెడ్డి, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పట్టణ అధ్యక్షులు మల్లేశం, OBC మోర్చా జిల్లా అధ్యక్షులు బొప్పి శ్రీహరి, అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, వర్తక సంఘం వ్యాపారులు సల్లా దామోదర్, మాణిక్యం, రాధాకృష్ణ, హమాలీ సోదరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్‌లో కష్టాల రాజ్యం..!