ఎమ్మెల్యే సారూ.. మాకేంటీ ఈ గతి..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యే సారూ.. మాకేంటీ ఈ గతి..!
– మీరు పాసులిచ్చినా బస్సులు రావడం లేదు
– ప్రతి రోజూ నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థులు
– తాండూరు మండల విద్యార్థుల ఆవేధన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: మాకోసం బస్సు నడిపించేలా చూడాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మండలంలోని గ్రామాలకు చెందిన విద్యార్థులు వేడుకుంటున్నారు. గ్రామానికి బస్సులు రాకపోవడంతో ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి అందించిన బస్సు పాసుల సాయం ఫలితం లేకుండా పోతుందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. తాండూరు మండలంలోని చెంగోల్‌, చింతామణి పట్నం, పర్వతాపూర్‌ గ్రామాలకు గత కొన్ని రోజుల నుంచి బస్సులు రావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఆయా గ్రామాల నుంచి పదుల సంఖ్యల్లో విద్యార్థులు బస్సుల్లో వెళ్లివస్తూ చదువుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా చెంగోల్, పర్వతాపూర్, చింతామణి పట్నం గ్రామాల మీదుగా బస్సులు రాకపోవడంతో నడుచుకుంటూ వెళుతున్నారు. బ్యాగులు మోసుకుని ప్రతి రోజూ కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని నెలల క్రితమే తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే విద్యార్థుల బస్సు ఫాసు ఫీజులను చెల్లించి విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. రూ. లక్షల్లో విద్యార్థుల కోసం చేసిన సాయం తాండూరు మండల విద్యార్థులకు అమలు కాకుండా వృధాగా పోతోంది.

ఇప్పటికైనా ఎమ్మెల్యే సారు స్పందించి గ్రామాల మీదుగా బస్సు సౌకర్యం కల్పించేలా దృష్టిసారించాలని కోరుతున్నారు. మరోవైపు విద్యార్థుల బస్సు సమస్యను పరిష్కరించాలని పలు ప్రజా సంఘాల నాయకులు, ఆయా గ్రామాల యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

పేద విద్యార్థుల సేవలో..!