కాంగ్రెస్‌లో కష్టాల రాజ్యం..!
– అస్తవ్యస్తంగా ఆరు గ్యారెంటీలు
– బీఆర్ఎస్ పథకాలకు సర్కారు ఎగనామం
– కొండా, రంజిత్ రెడ్డిలవి స్వార్థ రాజకీయాలు
– బీసీల నేత కాసానికి గెలిపించుకుందాం
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– యాలాల మండలంలో గులాబీ జోష్
తాండూరు, దర్శని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ పాలనలో కష్టాల రాజ్యం కొనసాగుతుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని కోకట్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే సైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరుపున ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన అసరా, కళ్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్ పథకాలకు ఎగనామం పెట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అస్తవ్యస్తంగా మారాయని విమర్శించారు. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను ఆగం చేసిందన్నారు. రూ.2లక్షల రుణమాఫిలో రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు.
రుణమాఫీని అమలు చేయకుంటే దిగిపోతారా అంటూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సవాల్ చేశారు. కాగ్నా నుంచి కోడంగల్ కు నీళ్లు తరలిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డిలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే మరోసారి గోసపడతామన్నారు. బీసీల కోసం పోరాటం చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ను బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ జెడ్సీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్. లైబ్రరీ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి. నాయకులు అరవింద్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి. ఆయా గ్రామాల నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

