పేదల ఆరోగ్యానికి పెద్దపీట..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పేదల ఆరోగ్యానికి పెద్దపీట..!
– సీఎంఆర్ఎప్ పథకంతో అండ
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– రూ.42లక్షల విలువైన ఎల్ఎసీల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పథకంతో పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని తాండూరు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల మండలాలకు చెందిన 98 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా మొత్తం లబ్దిదారులకు మంజూరైన రూ.42లక్షల విలు వైన ఎల్వోసీలోను అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వంలో పేదల ఆరోగ్యానికి పెద్ద పీట వేయడం జరుగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదలకు కార్పోరేట్ స్థాయి వైద్యం అందించి.. వారి ఆరోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ పథకంతో అండగా నిలుస్తున్నారని అన్నారు. అర్హులైన పేదలకు.. ఆపదలో ఉంటే సీఎంఆర్ఎఫ్ ప థకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి. కోట్ పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ అంజయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ధారాసింగ్, పీఎసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కోట్ పల్లి మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, బషీరాబాద్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరాజబాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాము, సోమశేఖర్, నాయకులు మహిపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, చంద్రశేఖర్, మహిళ నాయకురాలు గాజుల మాధవి, వివిధ గ్రామాల నేతలు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కందనెల్లిలో వైభవంగా భగవద్గీత పారాయణం