ఆన్‌లైన్‌లో ఓటర్‌ స్లిప్‌..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఆన్‌లైన్‌లో ఓటర్‌ స్లిప్‌..!
– టెన్షన్‌ లేకుండా డౌన్‌లోడ్‌ చేసుకోండి
– ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం
దర్శిని డెస్క్ : ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మే 13 వ తేదీన 4 వ దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలోనే తెలంగాణలో 17 లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా బీఎల్ఓ అధికారులు క్షేత్రస్థాయిలో ఓటర్లకు ఓటర్ స్లిప్‌లు అందిస్తున్నారు.

కానీ కొందరికి ఓటర్ స్లిప్‌లు అందడం లేదు. దీంతో ఓటరు స్లిప్ అందని వారు కొందరు ఓటు వేయకుండా ఇంట్లోనే ఉంటారు. అలాంటి వారికి ఓటర్ స్లిప్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు కూడా చేసింది. ఈ ఓటర్ స్లిప్‌పై ఓటరు వివరాలు ఉంటాయి. ఓటరు పేరు, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా-ఈసీఐ యాప్, వెబ్‌సైట్ లేదా ఓటర్ హెల్ప్‌లైన్ నుంచి ఓటర్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది.

డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌ను మొబైల్ యాప్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
డౌన్‌లోడ్ E-EPIC అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఆ తర్వాత మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేయాలి.
మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత ఓటర్ ఐడీ కార్డు మీద ఉన్న EPIC నంబర్‌ను ఎంటర్ చేయాలి.
ఒకవేళ EPIC నంబర్ లేకపోతే అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్‌ ద్వారా కూడా ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ కనిపిస్తుంది.
అక్కడే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్  ?
గూగుల్‌లో https://voters.eci.gov.in ఓపెన్ చేయాలి.
మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది.
ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవుతుంది.
అందులో Download E-EPIC అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఓటర్ ఐడీ కార్డుపై ఉన్న EPIC నంబర్‌ను ఎంటర్ చేయాలి.
అక్కడి నుంచి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇదికూడా చదవండి…

కర్బూజలో పోషకాలు..!