బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు..!
– రాష్ట్రంలో పదేండ్లు కాంగ్రెస్సే ఉంటది
– సీఎం రేవంత్‌పై, పార్టీపై నమ్మకముంది
– జాతీయ నాయకుల్లో ఆయనకు 17వ ర్యాంకు
– బీఆర్ఎస్ వల్లే తెలంగాణ సర్వనాశనం
– ఎన్నికల తరువాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం
– ప్రియాంక గాంధీ రాకకు భారీగా జన సమీకరణ
– తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ముప్పు వాటిళ్లే ప్రమాదం ఉందని, అందకే ఆలోచించి ఓటు వేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం తాండూరు పట్టణం విలియమూన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జన జాతరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శురాలు ప్రియాంక గాంధీ హాజరవుతున్న నేపథ్యంలో సభా ఏర్పాట్లను పరిశీలించేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాండూరుకు వచ్చారు.
ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకంతో రాష్ట్రంలో ఇంకో పది. 15ఏండ్లు కాంగ్రెస్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జాతీయ నాయకుల ర్యాంకులలో సీఎం రేవంత్ రెడ్డి 17వ స్థానంలో ఉండడం, అతి తక్కువ సమయంలో ఈ ఘనతను సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ బీఆర్ఎస్ పదేండ్ల పాలన వల్ల రాష్ట్రం సర్వనాశమయ్యిందని విమర్శించారు.
దీంతో కాంగ్రెస్ సర్కారుకు ఆర్థిక క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. ఎన్నికల సమయంలో దేవుళ్లపై ఓట్టేసీ ప్రజలకు మాటిచ్చామని గుర్తుచేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.2లక్షల రుణమాఫీలను ఎన్నికల కోడ్ తరువాత అమలు చేస్తామన్నారు. అదేవిధంగా దేశంలో కూడా క్లిష్టపరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ మతం పేరుతో ఓట్లు అడిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశం మట్టిలో రక్తాన్ని చిందించిన గాంధీ కుంటుంబాన్ని కూడా వదలలేదన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై సీబీఐ కేసులు పెట్టి విచారించారని తెలిపారు. ఆఫీషియల్ హౌస్ నుంచి కూడా వెళ్లగొట్టేలా చేశారని అన్నారు. దేశం విచ్చిన్నం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకునేందుకే రాహుల్ గాంధీ జూడో యాత్ర చేపట్టారని అన్నారు. ప్రస్తుతం బీజేపీ నమ్మి మూడోసారి గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగం తీసుకవచ్చే ప్రమాదం ఉందన్నారు. కావున అందరు గమనించి ఓటు వేయాలని సూచించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సలహదారులు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు ఖాయమన్నారు. ఇప్పటికే 150 స్థానాలకు పైగా కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శురాలు ప్రియాంక గాంధీ తాండూరుకు వస్తుందన్నారు. ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్ని తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఎన్నికల తరువాత 3500 ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామన్నారు. నూటికి నూరు శాతం ఆగస్టులో మంజూరు చేస్తామన్నారు.
రంజిత్ రెడ్డి గెలుపు ఖాయం
చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు ఖాయమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం విలియమూన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న జన జాతర సభకు తాండూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి 50వేల మందిని తరలిస్తామన్నారు. దీంతో పాటు వికారాబాద్, పరిగి నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలివస్తారని అన్నారు. అంతకుముందు విలియమూన్ గ్రౌండ్లో సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కమీషన్ మెంబర్ ఎం. రమేష్ మహారాజ్, పార్లమెంట్ ఇంచార్జ్ మహేష్, టీపీసీసీ ఓబీసీ సెల్ కన్వీనర్ సునీతా సంపత్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

