మృతుల కుటుంబాలకు పరామర్శ

తాండూరు రాజకీయం వికారాబాద్

మృతుల కుటుంబాలకు పరామర్శ
– రూ. 10వేల చొప్పున ఎమ్మెల్సీ ఆర్థిక సాయం
– ప్రభుత్వ సాయం అందేలా కృషి: మహేందర్ రెడ్డి
– ఒక్కో కుటుంబానికి రూ.10వేలు అందించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : పిడుగు పాటుతో మృతి చెందిన రైతు, కూలీల కుటుంబాలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. ఆదివారం యాలాల మండలంలో పిడుగుపాటుతో వెంకటయ్య, శ్రీనివాస్, లక్ష్మయ్య అనే రైతు కూలీలు పిడుగుపాటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సోమవారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి వద్దకు చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.

అనంతరం బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. 10వేల చొప్పున మూడు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావుకు స్వయంగా ఫోన్ చేసి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందించేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పిడుగు పాటులో ఘటనలో రైతు కూలీల మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని. ప్రభుత్వం నుంచి త్వరగా పరిహారం అందించేలా కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ వెంట కాంగ్రెస్ నాయకులు సిద్రాల శ్రీనివాస్, భీమయ్య, అబ్దుల్ రజాక్, బీడ్కర్ రఘు తదితరులు ఉన్నారు.

ఒక్కో కుటుంబానికి ఎమ్మెల్యే సాయం
మరోవైపు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా బాధిత కుటుంబాలకు భరోసా ప్రకటించారు. తన అనుచరుల ద్వారా బాధిత ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. రూ. 10వేల చొప్పున మూడు కుటుంబాలకు రూ. 30వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిద్రాల శ్రీనివాస్, బీమయ్య, హన్మంతు ముదిరాజ్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఆఫర్లకు అత్యాస పోవద్దు..!