మందుబాబులకు జోష్‌పుల్‌ న్యూస్

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

మందుబాబులకు జోష్‌పుల్‌ న్యూస్
– 31న అర్దరాత్రి వరకు మద్యం విక్రయాలు
– అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు సర్కారు జోష్‌పుల్ న్యూస్ చెప్పింది. న్యూఇయర్ వేడుకలకు కిక్కించేలా జరుపుకునేందుకు అవకాశం కల్పించింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం విక్రయ సమయాన్ని పొడిగించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు ఎక్సైజ్‌ శాఖ అనుమతి ఇచ్చింది. బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించేందుకు అవకాశం కల్పించారు. మరోవైపు న్యూ ఇయర్‌ సందర్భంగా పోలీసులు పలు నిబంధనలు విధించారు. త్రీ స్టార్‌, ఆపై హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల ఎంట్రీ, ఎగ్జిట్‌ ద్వారాల వద్ద సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలని నిర్వాహకులను ఆదేశించారు. పార్కింగ్‌ ప్రదేశాల్లోనూ కెమెరాలు తప్పనిసరి చేశారు. అసభ్యకర నృత్యాలు లేకుండా చూడాలని కోరారు. వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్‌కి మించకూడదని షరతు విధించారు. పరిమితికి మించి టికెట్లు, పాసులు జారీ చేయవద్దని స్పష్టం చేశారు. పబ్బులు, బార్లలో మైనర్లను అనుమతించకూడదని పోలీసులు సూచించారు.