
సదరం క్యాంపు షెడ్యూల్ విడుదల
– ప్రకటించిన జిల్లా అధికారులు
– జూన్‌లో ఎన్నీ స్లాట్లు కేటాయించారంటే..?
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో సదరం క్యాంపు షెడ్యూల్ విడుదలైంది. జూన్ మాసానికి సంబంధించిన క్యాంపుల వివరాలను ప్రకటించారు. వికలాంగత్వంకు 350, వినికిడిలోపంకు 60, కంటిచూపుకు 60, మానసిక వికలాంగత్వానికి సంబంధించి 120 స్లాట్ల బుకింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మొత్తం 590 స్లాట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 6వ తేది నుంచి సదరం క్యాంపులు ప్రారంభం కాబోతున్నాయి.

తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వికారాబాద్‌లోని జీజీహెచ్ ఆసుపత్రిలో క్యాంపులు నిర్వహిస్తున్నారు. తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో 6, 27వ తేదీలలో వికలాంగత్వంపై, 11, 21వ తేదిలలో మానసిక వికలాంగత్వంపై, 29న వినికిడి లోపంపై క్యాంపులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వికారాబాద్‌లోని జీజీహెచ్ ఆసుపత్రిలో 10, 18, 26వ తేదీలలో వికలాంగత్వంపై, 11న కంటిచూపులోపంపై సదరం క్యాంపులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అర్హులైన వికలాంగులు సదరం క్యాంపులకు స్లాట్లు బుక్ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇదికూడా చదవండి…

