
రేపు తాండూరులో పవర్ కట్..!
– ప్రకటించిన విద్యుత్ శాఖ అధికారులు
– అంతరాయం టైమింగ్ ఇదే..
తాండూరు, దర్శిని ప్రతినిధి : వానాకాలానికి ముందు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ మరమ్మత్తులు చేపట్టడం ఆనవాయితీ. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం విధిస్తుంటారు. తాండూరులో కూడా గత కొన్ని రోజులుగా వివిధ ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం విధిస్తున్నారు. తాజాగా రేపు శనివారం తాండూరు పట్టణంలో పవర్ కట్ విధిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వరకు పవర్ కట్ ఉంటుందని ప్రకటనలో వెల్లడించారు.

తాండూరు పట్టణంతో పాటు పాత తాండూరు పరిధిలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని డీఈ భాను ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మత్తుల కారణంగా విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు చెప్పారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

