గుణాత్మక పాలనతోనే గులాబీలో చేరికలు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– టీఆర్ఎస్‌లో చేరిన చెన్నారం సర్పంచ్ సాయిలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న గుణాత్మక పాలన చూసి గులాబీ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యాలాల్ మండలం చెన్నారం గ్రామ సర్పంచ్ సాయిలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సర్పంచ్ సాయిలుకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో గౌ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులకు ప్రజాధరణ లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, యాలాల్ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ మెంబర్ అక్బర్ బాబా, చంద్రశేఖర్ రెడ్డి, రఘు రెడ్డి, కృష్ణ, అమర్నాథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


