సీజీరీయన్‌ డెలివరీలు చేస్తే చర్యలు..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

chai jr
సీజీరీయన్‌ డెలివరీలు చేస్తే చర్యలు..!

– సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
– ప్రైవేటులో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
– ఆసుపత్రిలలో వైద్యాధికారుల అకస్మీక తనిఖీలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : గర్భిణీలకు తప్పనిసరి అయితేనే సీజీరీయన్ ప్రసవాలు చేయాలని జిల్లా మాతా శిశు ఆసుపత్రిల ప్రోగ్రాం అధికారి డా. సాయిబాబ అన్నారు. వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పాల్వన్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం తాండూరు పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులలో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని శ్రీ శివ నర్సింగ్ హోమ్ ఆసుపత్రిని డా. సాయిబాబ, డిప్యూటీ మాస్ మీడియా అధికారి వి.శ్రీనివాసులు కలిసి తనిఖీ చేశారు.

ఆసుపత్రిలో సీజీరీయన్, సాధారాణ ప్రసవాలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో పేషెంట్ల కేసు షీట్ వివరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల కంటే సీజీరీయన్ ప్రసవాలే అధికంగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో అత్యవసరమైన పరిస్థితులలో మాత్రమే సీజీరీయన్ ప్రసవాలు చేయాలని సూచించారు. సీజీరీయన్ ప్రసవాలంటే సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు.

సీజీరీయన్ చేయాల్సి వస్తే పేషెంట్ కేస్ షీట్లో అందుకు తగిన కారణాలను నమోదు చేయాలన్నారు. ఆ గర్భిణీ యొక్క పూర్వ స్థితి, ప్రస్తుత గర్భస్త చరిత్ర వివరాలను నమోదు చేయాలన్నారు. ఆపరేషన్ థియేటర్ నోట్స్, చికిత్స, డిశ్చార్జీ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి సీజీరీయన్ ప్రసవాలు చేస్తే క్లీనికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టు కింద ఆసుపత్రితో పాటు గైనాకాలజీస్టులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

మతిస్థిమితం లేని వ్యక్తిపై దాడి..!