
సంబరంగా దశాబ్ది పండగ..!
– మున్సిపల్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ
– పాల్గొన్న నేతలు, కౌన్సిలర్లు, అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతున్న నేపథ్యంలో తాండూరులో దశాబ్ది పండగను సంబురంగా జరుపుకున్నారు. ఆదివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర దశాబ్ది పండగ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు తాండూరు నేతలు, కౌన్సిలర్లు హాజరయ్యారు. ముందుగా తెలంగాణ తల్లి, తెలంగాణ జాతిపిత ఫ్రోఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు.

అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతం ఆలాపిస్తూ నేతలు, కౌన్సిలర్లు, అధికారులు వందనం సమర్పించారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలు, అమరుల త్యాగఫలంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం పురోగతితో అమరవీరుల త్యాగాలకు అసలైన నివాళి దక్కుతుందన్నారు. అదేవిధంగా పట్టణంలోని ఇందిరా చౌరస్తాలోని ఫ్రోఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, అంతారం లలిత, మధుబాల, మమత, బోయరాజు, బాలప్ప, ప్రభాకర్ గౌడ్, రాము, భీంసింగ్, సల్మా ఫాతిమా,బంటారం లావణ్య, ప్రవీణ్ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

