వధశాల వేలం పూర్తి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrవధశాల వేలం పూర్తి..!
– మటను, బీఫ్ కు వేర్వేరుగా వేలం
– మున్సిపల్‌కు ఆధాయం పట్ల హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో వధశాల(మేకలు, గొర్రెలు), బీఫ్ కు బహిరంగ వేలం పూర్తయ్యింది. శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిల సమక్షంలో వధశాలకు, బీఫ్ కు వేలం వేరు వేరుగా నిర్వహించారు. వదశాలకు ఎండీ మాజీద్ అనే వ్యక్తి రూ.46వేలు పాడి దక్కించుకున్నారు. బీఫ్ కు అబ్దుల్ ఖయ్యూం ఖురేషీ అనే వ్యక్తి రూ. 50వేలు పాడి దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ బహిరంగ వేలంలో మున్సపల్ కు ఆధాయం రావడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఇటీవలే బహిరంగ వేలం ద్వారా రూ.30లక్షలు 65వేలు ఆదాయం వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. తాజాగా పధశాలకు రూ. 45వేలు, బీఫ్ కు రూ. 50వేలు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆధాయంతో అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి మాట్లాడుతూ వేలం దక్కించుకున్న అర్హులు 7 రోజుల్లో వేలం డబ్బులు చెల్లించాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

దేవాలయాల్లో పాలకమండళ్లను పూర్తి చేయండి