రోడ్డు ప్రమాదాల మరణాలు.. పాలకుల హత్యలే..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రోడ్డు ప్రమాదాల మరణాలు.. పాలకుల హత్యలే..!
– సింపతి రాజకీయాలు సిగ్గుచేటు
– ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు కె.గోపాల్
– చేవేళ్ల రోడ్డు ప్రమాదం ఆర్టీసీ డ్రైవర్ కు నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు ప్రమాదాలలో పలువురు మరణాలు ప్రభుత్వ పాలకుల హత్యలే అని తాండూరు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది కె.గోపాల్ అన్నారు.

చేవేళ్ల రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి బాబ మృతి చెందిన సంగతి తెలిసిందే. మంగళవారం తాండూరు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్ దస్తగిరిబాబ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన న్యాయవాది కె.గోపాల్ మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి బాబ మృతి బాధాకరమన్నారు. ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో విఫలం చెందడం శోచనీయమన్నారు.
kvcs
నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ రోడ్డు ప్రమాదాలలో జరుగుతున్న మరణాలు పాలకులు చేస్తున్న హత్యలుగానే బావించాల్సి వస్తుందని అన్నారు. ప్రాణాలు పోయాకా పరిహాలు ఇచ్చి సింపతిలు పొందాలని చూడడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా పాలకులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు జబ్బార్ అనంతయ్య, నాయకులు లక్ష్మయ్య, వీరయ్య, ఎం.కే. రెడ్డి, తుకారం, శాంతుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కారు బోల్తా..!