టీ తాగడం మానేస్తే..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

chai jrటీ తాగడం మానేస్తే..!
– ఆరోగ్యానికి ఎన్ని లాభాలో
– తెలిస్తే మీరే ఆశ్చర్య పోతారు
దర్శిని డెస్క్‌ : టీ.. తేనీరు.. ఇది ఆరోగ్యానికి అమృతంతో పాటు విషంగా పనిచేస్తుందని చాలా మందికి తెలియదు. పాలలో కొద్దిగా పంచదార, చిటికెడు టీపొడి వేసి బాగా మరిగిస్తే రుచికరమైన టీ తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పానీయాలలో టీ కూడా ఒకటి. టీ ఎందుకు తాగాలి అని అడిగితే టీ ప్రియులు వంద కారణాలు చెబుతారు. కానీ, టీ తాగడం మానేస్తే ఏమవుతుందో తెలుసా? ఒక్క వారం టీ తాగడం మానేస్తే మీ శరీరం, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

టెన్షన్ తగ్గించడంలో టీ బాణంలా పనిచేస్తుంది. కానీ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై కొంత ప్రభావం ఉంటుంది. కాబట్టి టీ వినియోగం మితంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. పేగు సంబంధిత వ్యాధులు ఉంటే టీ తాగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. టీ వినియోగానికి దూరంగా ఉంటే గుండెల్లో మంట, తల తిరగడం, గుండె వేగంలో హెచ్చుతగ్గులు వంటి సమస్యలు తగ్గుతాయి.

చేతులు వణికిపోతుంటే టీ తాగడం వల్ల ఈ సమస్య క్రమంగా తగ్గుతుంది. ఒక వారం రోజుల పాటు టీ తాగడం మానేస్తే మీ అధిక రక్తపోటు తిరిగి నార్మల్ పొజీషన్ లోకి వస్తుంది. అలాగే అధిక రక్తపోటు సమస్య మొత్తమే పోతుంది. టీ అలవాటు తగ్గించుకున్న తరువాత బాగా నిద్రపోవచ్చు. విరేచనాలు, వాంతులు లేదా చెడు అపానవాయువు/ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి. వీటన్నింటితో పాటు బరువు తగ్గడం మొదలవుతుంది. రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ టీ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు వివరిస్తున్నారు. వారం రోజుల పాటు టీ తాగడం మానేస్తే అజీర్ణం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

ఇదికూడా చదవండి….

ప్రజా సమస్యలపై ఫోకస్..!