అక్షర స్కూళ్లో ఎన్నికల సందడి..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

అక్షర స్కూళ్లో ఎన్నికల సందడి..!
– ఉత్సహంగా హెడ్ బాయ్, గర్ల్ ఎన్నిక
– ఓటు వేసిన స్కూల్ విద్యార్థులు
– అభినందించిన యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని అక్షర్ కాన్సెప్ట్ స్కూల్లో ఎన్నికల సందడి నెలకొంది. సోమవారం పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్‌, స్కూల్ సెక్రటరీలకు ఎన్నికలు నిర్వహించారు. 2024-25సంవత్సరానికి గాను ఈ ఎన్నికలను నిర్వహించారు. ఉదయం నుంచి స్కూల్లో ఎన్నికల సందడి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పాఠశాలకు చెందిన విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఓటు వేశారు. ఓటు వేసి స్కూల్ హెడ్ బాయ్‌ గా మణిదీప్, హెడ్ గర్ల్‌గా యువశ్రీ, గెమ్స్ సెక్రటరీగా సదియా(9వ తరగతి), సైన్స్, సోషల్ సెక్రటరీగా సమీక్ష(9వ తరగతి), లిటేవరీ సెక్రటరీగా హరిణి(9వ తరగతి)లను ఎన్నుకోగా 9వ తరగతి నుంచి రెడ్‌ హౌస్‌, బ్లూహౌస్, ఎల్లో హౌస్‌, గ్రీన్ హౌస్ విభాగాలలో కెప్టెన్, సెక్రటరీ, వైస్ కెప్టెన్‌లను ఎన్నుకున్నారు.

అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ మోహన్ కృష్ణ, డైరెక్టర్స్ ఎండీ యూనుస్, ప్రవీణ్‌, రవీందర్, శ్రీకాంత్, తదితరులు ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రయంలో ఉపాధ్యాయులు అమ్రిత, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, రవికుమార్, విజయ్ కుమార్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ముచ్చటగా మూడు..!