ముచ్చటగా మూడు..!
– డివిజన్ స్థాయి ప్రజావాణిలో ఫిర్యాదులు
– ఫిర్యాదులను పరిష్కరిస్తాం: ఆర్డీఓ శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ముచ్చటగా మూడు ఫిర్యాదులు అందాయి. ఈ విషయాన్ని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత మూడు వారాలుగా తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తాజాగా సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన ప్రజావాణిలో మూడు ఫిర్యాదులు అందాయి. ఇందులో ఎంపీడీఓ-1, రెవెన్యూ-1, మైన్స్-1 శాఖలకు సంబంధించి ఫిర్యాదులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ప్రజావాణిలో అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, ఆర్అండ్్బ, ఇరిగేషన్, అటవి శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

