బార్లీ వాటర్.. వెరీ బెటర్..!
– శరీరంలో వేడిని తగ్గించే గుణాలు
– మధుమేహం, గుండె వ్యాధులకు ప్రయోజనం
– ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి
దర్శిని ప్రతినిధి : మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి ,ఆరోగ్యకరమైన జీవనానికి చాలా ముఖ్యం. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలలో బార్లీ కూడా ఒకటి. దీని విత్తనాలు శతాబ్దాలుగా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయి. బార్లీలో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, అమినో యాసిడ్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరంలోని వేడిని తగ్గించి, తక్షణ శక్తిని అందించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గడం నుంచి గుండె సంబంధిత వ్యాధుల నివారణ వరకు బార్లీ వాటర్ సహాయపడుతుంది.
ఆజీర్తీ, వేడి సమస్యలు దూరం
బార్లీలోని పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా శుభ్రపడుతుంది. కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అజీర్ణం, మలబద్దకం సమస్యలు దరి చేరవు. బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థ, విష పదార్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి. అదేవిధంగా రోజూ బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలోని వేడి బయటకు పోయి చల్లగా మారుతుంది. బార్లీ నీళ్లు తాగితే.. క్యాల్షియం, ఇనుము, మాంగనీసు, మెగ్నీషియం, జింక్, రాగి.. వంటి మినరల్స్, సాల్ట్స్ తో పాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల శరీరానికి అందుతాయి.
గుండె సమస్యలకు చెక్..
బార్లీలో డైటరీ ఫైబర్ ఉంటుంది. అంటే ఇది నీటిలో కరిగిపోతుంది. డైటరీ ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. ఫైబర్ పుష్కలంగా తినే వ్యక్తులకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. బార్లీ చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుందని ఓ అధ్యయనం వెల్లడించింది.
షుగర్ కంట్రోల్..
షుగర్ పేషెంట్స్‌కు బార్లీ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ కూడా అదుపులోనే ఉంటుంది. షుగర్ పేషెంట్స్‌కు రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండాలంటే.. రోజూ బార్లీ నీళ్లు తాగడం మంచిది.
డైటరీ ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది. ఫైబర్ పుష్కలంగా తినే వ్యక్తులకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
ఇలా తయారు చేసుకోవచ్చు…
బార్లీని లేత గోధుమ వర్ణం వచ్చే వరకు వేయించుకొని, పొడి చేసుకోవాలి. మూడు కప్పుల నీటిని పొయ్యి మీద పెట్టి మరిగించాలి. అలాగే రెండు చెంచాల బార్లీ పొడిని పావు కప్పు నీటిలో ముందుగా కలిపి ఉంచుకోవాలి. మరిగిన నీటిలో ఈ మిశ్రమాన్ని కలపాలి. పది నిమిషాలు ఉడికించి చల్లార్చి వడకట్టుకోవాలి.
ఇదికూడా చదవండి…

