ర‌క్షాబంధ‌న్ విలువల‌ను కాడాపాలి

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

ర‌క్షాబంధ‌న్ విలువల‌ను కాడాపాలి
– కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు ప్ర‌భాక‌ర్ గౌడ్
– బ్ర‌హ్మాకుమారి స‌మాజం ఆధ్వ‌ర్యంలో వేడుక‌లు
తాండూరు, ద‌ర్శ‌ని ప్ర‌తినిధి: అన్నా చెల్లెల్ల‌కు అనుబంధానికి ప్ర‌తీక‌గా నిలిచే ర‌క్షాబంద‌న్ విలువ‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రు కాపాడాల‌ని కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు, కౌన్సిల‌ర్ ప్ర‌భాక‌ర్‌గౌడ్ అన్నారు. శ‌నివారం తాండూరు ప‌ట్ట‌ణం 25 వ వార్డులోని బ్రహ్మ‌కుమారి స‌మాజంలో ర‌క్షాబంధ‌న్ వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. ఈకార్య‌క్ర‌మానికి వార్డు కౌన్సిల‌ర్, కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు ప్ర‌భాక‌ర్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బ్ర‌హ్మ‌కుమారి స‌మాజం స‌భ్యులు ప్ర‌భాకర్‌గౌడ్‌కు రాఖీ క‌ట్టి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కౌన్సిల‌ర్ ప్ర‌భాక‌ర్‌గౌడ్ మాట్లాడుతూ సోద‌రీ, సోద‌రీమ‌ణుల ప్రేమానురాగాల‌కు రక్షాబంధ‌న్ చిహ్న‌మ‌ని అన్నారు. సోద‌ర‌భావంతో క‌ట్టిన రాఖీ విలువ‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రు కాపాడాల‌న్నారు.


ర‌క్షాబంద‌న్ ఉద్దేశ‌మ‌దే..
————————-
అనంత‌రం బ్రహ్మ‌కుమారి స‌మాజం స‌భ్యురాలు జ‌గ‌దేవి మాట్లాడుతూ మానవీయ సంబంధాలను పటిష్టం చేస్తూ.. సోదర ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే ‘రక్షా బంధన్” సంప్రాదాయ బద్ధమైన మన విలువలను మరింత ఉట్టిపడేలా చేసూస్తుంద‌ని అన్నారు. ప్రతి ఒక్క రూ సోదరభావంతో మెదలాలనే సందేశాన్ని తెలియజేయడమే రక్షాబంధన్‌ఉద్దేశ్యమని తెలిపారు.