నాపరాతి లోడ్ లారీ బొల్తా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

నాపరాతి లోడ్ లారీ బొల్తా..!
– నలుగురు వ్యక్తులకు గాయాలు
– ఒకరి పరిస్థితి విషమం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : నాపరాతి లోడ్‌తో వెళుతున్న ఓ లారీ బొల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో సహ నలుగురు గాయాలపాలయ్యారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. గురువారం తాండూరు మండలం గౌతాపూర్ చౌరస్తా వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బెల్కటూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కరణ్‌ కోట్ నుంచి లారీ(ఏహెచ్‌జే 6089) నాపరాతి లోడ్‌తో బయల్దేరాడు.

గౌతాపూర్ చౌరస్తా వద్దకు రాగానే లారీ అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో పాటు ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదికూడా చదవండి…

మత్తులో టక్కర్..!