జోరుగా పారిశుద్ధ్య ప‌నులు

తాండూరు

జోరుగా పారిశుద్ధ్య ప‌నులు
– హైద‌రాబాద్ రోడ్డు మార్గంలో డివైడ‌ర్ల ప‌రిశుభ్రం
తాండూరు, ద‌ర్శ‌ని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ ఆధ్వ‌ర్యంలో పారిశుద్ధ్య ప‌నులు చేప‌ట్టారు. మంగ‌ళ‌వారం మున్సిప‌ల్ శానిట‌రీ ఇనుస్పెక్ట‌ర్ శ్యాంసుంద‌ర్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ రోడ్డు మార్గంలో రోడ్డు ప‌రిశుభ్ర‌త ప‌నులు చేయించారు. ఈ సంద‌ర్భంగా కార్మికులు రోడ్డు మ‌ద్య‌లోని డివైడ‌ర్ చుట్టూ పేరుకుపోయిన మ‌ట్టిని తొల‌గించారు. డివైడ‌ర్ మ‌ద్య‌లోని చెట్ల వ‌ద్ద పెరిగిన పిచ్చిమొక్క‌ల‌ను కూడ తొల‌గింపు చేయించారు. రోడ్డుపై దుమ్ము నిల‌వ‌కుండా అటూ ఇటూ ఊడ్చి వేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ జ‌వాన్లు అశోక్, శ్రీ‌నివాస్(బొట్టు), వెంక‌టేష్‌, వీర‌ణ్ణ‌, శ్రీ‌నివాస్, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు.