వడ దెబ్బకు టీచర్ బలి
– మృతి చెందిన మహిళ ఉపాధ్యాయురాలు
– ఎన్నికల విధులకు హాజరై తిరిగి వెళుతుండగా విషాదం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వేసవి వడ దెబ్బకు ఓ మహిళ టీచర్ బలైపోయింది. వడదెబ్బ లక్షణాలతో టీచర్ మరణించడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం సేడం తాలూకాకు చెందిన రాణి అనే మహిళ బషీరాబాద్ మండలంలోని ఓ తాండాలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది.
అయితే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బుధవారం తాండూరు పట్టణం ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు ఆమె హాజరయ్యింది. కార్యక్రమం అనంతరం తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ వద్దకు రాగానే ఆమెకు వాంతులు చేసుకుని అక్కడిక్కడే కుప్పకూలి పడిపోయింది.
గమనించిన స్థానికులు వెంటనే స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. వడ దెబ్బ లక్షణాలతో మృతి చెందినట్లు తెలుస్తోంది. వడ దెబ్బకు మహిళ టీచర్ బలి కావడం విషాదంతో పాటు కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని బోరున విలపించారు.
ఇదికూడా చదవండి…

