పొలంలో నాటు సారా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పొలంలో నాటు సారా..!
– గుట్టుగా తయారి కేంద్రం
– టాస్క్‌ఫోర్స్‌, పోలీసుల దాడులు
– సారా, బెల్లం పాకం ధ్వంసం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పంట పొలాలను సాగు చేసే పొలం వద్ద ఓ రైతు పచ్చని కుటుంబాలను నాశనం చేసే నాటు సారా తయారు చేస్తున్నాడు. గుట్టుగా సాగిస్తున్న వ్యవహారం గురించి టాస్క్ ఫోర్స్ పోలీసులు, పోలీసులకు తెలియడంతో జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. సారా తయారికి ఉపయోగించే నవసాగరం, బెల్లం పాకంతో పాటు అప్పటికే తయారు చేసిన నాటు సారాను ధ్వంసం చేశారు.

ఈ సంఘటన శనివారం పెద్దేముల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… పెద్దేముల్ మండలం తట్టెపల్లి గ్రామానికి చెందిన జాదవ్ చందర్ అనే వ్యక్తి గ్రామ శివారులోని తన పొలంలో గత కొన్ని రోజులుగా రహస్యంగా నాటు సారా తయారు చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్‌ పోలీసులు, పెద్దేముల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో సుమారు 15 లీటర్ల నాటు సారా, తయారికి ఉపయోగించే నవసగరం స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 2 బ్యాలర్ల లో నిల్వ ఉంచిన సుమారు 150 లీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేశారు. నాటు సారా తయారికి పాల్పడుతున్న చందర్ పై పెద్దేముల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్ఐ గిరి తెలిపారు. ఈ దాడులలో టాస్క్ ఫోర్స్ ఫోలీసులతో పాటు పెద్దేముల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కడుపులో అడుగు పొడుగు సొరకాయ..!