చెట్టుకు జయంతి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చెట్టుకు జయంతి..!
– స్వర్గీయ కోట్రిక వెంకటయ్యకు నివాళులు
– పూజలు చేసిన మాజీ చైర్ ప‌ర్స‌న్ కోట్రిక విజయలక్ష్మీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరులో గ‌త ఎనిమిదేళ్లుగా చెట్టుకు జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. తాండూరు పట్టణంకు చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి భర్త స్వర్గీయ కోట్రిక వెంకటయ్య ఆరేళ్ల క్రితం త‌న జన్మదినం సందర్భంగా ఇంటి సమీపంలో మొక్కను నాటారు. కొన్నేండ్ల తరువాత ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ఆప్పటి నుంచి ఆయన స‌తీమ‌ణి తాండూరు మున్సిప‌ల్ మాజీ చైర్ ప‌ర్స‌న్ కోట్రిక విజయలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు ఆ చెట్టును బాధ్యతగా సంరక్షిస్తూ ప్ర‌తి యేడాది కోట్రిక వెంకటయ్య జన్మదినం రోజున ఆ చెట్టుకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు.

గత యేడాది క్రితం వారి నివాసం ముందున్న చెట్టును తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలోకి సజీవంగా తరలించారు. వ్యవసాయ క్షేత్రంలో కూడా చెట్టుకు జన్మదినం నిర్వహించే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. తాజాగా సోమవారం కూడ కోట్రిక వెంకటయ్య జయంతి సంద‌ర్భంగా భాగంగా ఆ చెట్టుకు 8వ పుట్టినరోజు జరిపారు. చెట్టుకు ప్ర‌త్యేక అలంక‌ర‌ణ చేసి కోట్రిక విజయలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డా.సి.సుధాకర్, రిటైర్డ్ టీచర్ కీర్తిశర్మ, ఆర్యవైశ్య, వాసవి మహిళ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

మారేడులో ఆరోగ్యం బోలెడు…!