రైతుబంధుకు రెడ్‌ సిగ్నల్‌..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రైతుబంధుకు రెడ్‌ సిగ్నల్‌..!
– నోఅబ్జెన్‌కు బ్రేక్ ఇచ్చిన ఈసీ
– రద్దు ఉత్తర్వులపై ప్రకటన
– మంత్రి వాఖ్యలతో నిర్ణయం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ వేసినట్లు ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన గ్రీన్‌ సిగ్నల్‌ అనుమతికి రెడ్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అనుమతిని రద్దు చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలనే రైతు బంధు నగదు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నికల సంఘం.. గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఇచ్చిన ‘నో అబ్జెక్షన్’ను ఉపసంహరించుకున్నట్లు ఈసీ ప్రకటించింది.

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ.. రైతుబంధుకు ఇచ్చిన అనుమతి రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. రైతుబంధు నిధులు విడుదల చేయవద్దని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే నిన్నటి ఎన్నికల ప్రచార సభలో ఈనెల 28న రైతుబంధు నిధులు విడుదల చేస్తామని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఈ మేరకు ఈసీ రెండు పేజీల లేఖను తెలంగాణ సీఈఓకు పంపింది. మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దీంతో రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ పడింది.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!