వార్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిన కౌన్సిలర్ బొంబీన వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని 14వ వార్డు కౌన్సిలర్ బొంబీనా కోరారు. సోమవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని తన వార్డులో రోడ్లు, డ్రైనేజీలతో పాటు అంగన్ వాడి కేంద్రం, ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రహారి గోడ. మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కె టాయించాలని ప్రణాళికలను అందజేశారు. ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో యువనాయకుడు రవూఫ్ ఉన్నారు.
ఇదికూడా చదవండి…

