ఫ్యాషన్ ఫ్రూట్ హెల్త్ ఫుల్..!
– ప్రజల్లో పెరుగుతున్న డిమాండ్
– షుగర్, గుండె జబ్బులపై ప్రభావం
– సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ
దర్శిని డెస్క్ : ఫ్యాషన్ ఫ్రూట్ ఈ పండు గురించి చాలా మందికి తెలియదు. కాని ఈ పండులోని ఔషధ గుణాలు మనిషికి పలు రోగాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ ఫ్యాషన్ ఫ్రూట్‌ను కృష్ణ ఫలం అని కూడా పిలుస్తారు. ఇటీవలి కాలంలో కివి, అవకాడో, బ్లూబెర్రీ వంటి పండ్ల వినియోగం ప్రజలలో పెరిగింది. అదేవిధంగా ప్యాషన్ ఫ్రూట్‌కు కూడా డిమాండ్ పెరిగింది. ఈ పండులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండు తీసుకోవడం వల్ల శరీరంలోని జీవక్రియ వేగంగా జరిగి, ఆహారం జీర్ణమై బరువును అదుపులో ఉంచుతుంది. ఈ పండు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సి మరియు బీటా కెరోటిన్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది అనేక కాలానుగుణ వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇందులో తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉన్నందున రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. అంతేకాదు ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే పిసెటనాల్, సిర్పుసిన్ బి సమ్మేళనం గుండె జబ్బుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. ఈ పండులో పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు ఇందులోని పీచు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఊబకాయం వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)
ఇదికూడా చదవండి…

