పెరిగిన గ్రూప్-1 పోస్టులు..!

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

పెరిగిన గ్రూప్-1 పోస్టులు..!
– కొన్ని పోస్టులకు ఇంటర్వూలు లేవ్
– ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో గ్రూఫ్‌-1 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరింది. వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ (TSPSC)కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా గ్రూప్‌-1లో 19 విభాగాలకు చెందిన 503 పోస్టులను ఇంటర్వ్యూలు లేకుండానే భర్తీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. పోస్టుల వివరాలకు కింది వరకు చూడండి..

 

 

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!