తెలంగాణ దార్శనీకుడు ఫ్రో.జయశంకర్..!
– సారు ఆశయాలు విస్మరిస్తే మరో ఉద్యమం తప్పదు
– తాండూరు జనసమితి ఇంచార్జ్ సాంబురు సోమశేఖర్
– టీజేఎస్, టీవీవీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జయంతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం కోసం జీవీతాన్నే త్యాగం చేసిన దార్శనీకుడు ఫ్రోఫెసర్ జయశంకర్ సార్ అని నేతలు, ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు అభివర్ణించారు. మంగళవారం పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ప్రొ. జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా తెలంగాణ జన సమితి, ప్రజాసంఘాలు, ఆర్టీసీ జేఏసీ, విద్యావంతుల వేదిక, ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా మునిసిపల్ ఫ్లోర్ లీడర్, టీజేఎస్ ఇంచార్జ్ సాంబురు సోమశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితం త్యాగం చేసిన వ్యక్తి ప్రొ. జయశంకర్ సార్ అన్నారు. గత ప్రభుత్వం ఆయనను విస్మరించింది, ఇప్పటి ప్రభుత్వం ఆయన జయంతి అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. జయశంకర్ సార్ ఆశయాలు విస్మరిస్తే మరో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.
ఉద్యమకారుడు, విద్యావేత్త రంగారావు గారు మాట్లాడుతూ జయశంకర్ సార్ జీవితం స్ఫూర్తిదాయకం అన్నారు. తాండూరులో ప్రజాయుద్ద నౌక గద్దర్ గద్దర్ గారి విగ్రహం తాండూరులో ఏర్పాటుకు తన సహకారం అందిస్తామన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ జయశంకర్ సార్ జీవితం ఏ తరం కోసమైతే త్యాగం చేసారో ఆ తరానికి ఆయన జీవిత చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది అన్నారు. ఆయన ఆశయాల అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణంలో అందరం భాగం కావాలని ఆయన కోరారు. సీఐటీయూ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ జయశంకర్ ఆశయాల అనుగుణంగా అణగారిన వర్గాలకు, కార్మిక, కర్షకులకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ప్రజాసంఘాల నాయకులు చంద్రయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడి జయశంకర్ సార్ ఆశయాల అనుగుణంగా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మించాలన్నారు.
మరోవైపు కళాకారులు బలరాం బృందం పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్‌యూ నాయకులు అనిల్ కుమార్ గౌడ్, ఆర్టీసీ నాయకులు అంజిలయ్య, మోదీన్, తెలంగాణ జనసమితి నాయకులు గౌరీ, జగప్ప, ఆదిత్య, సందీప్, విద్యావంతుల వేదిక నాయకులు జీలకర్ర రవీందర్, అధ్యాపకులు రాజశేఖర్, హమాలి నాయకులు భద్రేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

