సాయినాథుని సేవలో శంకరన్న..!
– గురుపౌర్ణమిలో ప్రత్యేక పూజలు
– షిర్డిసాయి మందిరంలో అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ సాయిబాబ సేవలో తరించారు. ఆదివారం గురు పౌర్ణమిని పురస్కరించుకుని కోకట్ రోడ్డు మార్గంలో వెలసిన శ్రీ షిర్డీ సాయి బాబా మందిరంలో జరిగిన ఉత్సవాల్లో శంకర్ యాదవ్ సతీమణి చంద్రకళ, కుమారుడు అభినవ్ సాయి, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా సాయిబాబకు పుష్పాభిషేకం చేశారు.
అనంతరం నిర్వహించిన భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ప్రతి యేడాది మాదిరిగానే దేవాలయంలో తన సొంత ఖర్చులతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి అన్నదానం ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నదానం చేసేలా ఏర్పాట్లు చేశారు. శంకర్ యాదవ్ స్వయంగా భక్తులకు అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సప్న పరిమళ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్ అంతారం లలిత, మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, నేతలు మాజీ డిపిసి సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీసీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, మనోహర్ యాదవ్, జొన్నల వినోద్, బంటు మల్లప్ప, మాధవరెడ్డి, మల్రెడ్డి, భవనాల హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

