బెల్లం, మిరియాలు.. ఇక దూరం రోగాలు..!

ఆరోగ్యం జాతీయం లైఫ్-స్టైల్ హైదరాబాద్

బెల్లం, మిరియాలు.. ఇక దూరం రోగాలు..!
– వర్షాకాలం వ్యాధులకు చెక్‌ పెట్టే మెడిసిన్‌
– తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
దర్శిని డెస్క్ : అన్ని కాలాల కన్నా వర్షాకాలంలో వచ్చే వ్యాదులు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు ఏమేమో చేస్తుంటాము. అలాంటి వ్యాధుల ముప్పు నుంచి బెల్లం, మిరియాలతో తప్పుకోవచ్చవని నిపుణులు చెబుతున్నారు. బెల్లం, మిరియాలు వేడిగా ప్రభావం ఉండటం వల్ల అనేక తీవ్రమైన సమస్యలను నయం చేయడంలో సహాయపడుతాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరిపై ప్రభావవంతంగా పనిచేస్తోంది. వైరల్ జ్వరం, జలుబు-దగ్గు వంటి వ్యాధులకు గురైతే మిరియాలు, బెల్లం కలిపి తింటే ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

మరిన్ని ఉపయోగాలు తెలుసుకుందాం….
గొంతు నొప్పి : వర్షాకాలంలో గొంతునొప్పి మరింత తీవ్రమవుతుంది. కాబట్టి బెల్లం, మిరియాలు చాలా సహాయకారంగా ఉంటాయి. దీనికి 50 గ్రాముల బెల్లం పొడి, 20 గ్రాముల మిరియాల పొడిని కలిపి, ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

జలుబు – దగ్గు : మిరియాలు, బెల్లం కలిపి తింటే జలుబు, దగ్గు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం ఒక గ్లాసు వేడి నీళ్లలో ఒక బెల్లం ముక్క, చిటికెడు ఎండుమిరియాల పొడి కలిపి తాగితే కొద్దిరోజుల్లో ఉపశమనం కలుగుతుంది.

జీర్ణక్రియ మెరుగు : బెల్లం, మిరియాలు కలయిక కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలను నియంత్రిస్తుంది. బెల్లం, నల్ల మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీని వినియోగం హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్థాయిని కూడా పెంచుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది: నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడే సెరోటోనిన్‌ని పెంచుతుంది. బెల్లం, నల్ల మిరియాలు ఒత్తిడి, ఆందోళన చెందుతున్న వారికి సహాయపడతాయి. చేతులు, కాళ్ళ నొప్పిని తగ్గించే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి.

పీరియడ్స్ లో నొప్పి తిమ్మిరి నుంచి ఉపశమనం: చాలా మంది మహిళలు బహిష్టు సమయంలో శరీర నొప్పులను అనుభవిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్లం, మిరియాలు తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇలా తినలేకపోతే.. టీలో బెల్లం, మిరియాలు వేసి తాగడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం: ఇందులో ఉండే పైపెరిన్ కీళ్ల నొప్పుల రోగులకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. బెల్లంలో ఉండే మంచి కాల్షియం, ఫాస్పరస్ కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. నల్ల మిరియాలులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
ఇదికూడా చదవండి…

కుట్టు మిషన్ ఫ్రీ..!