ఈనెల 30వరకు విద్యాసంస్థల బంద్
– రేపు అధికారికంగా ప్రకటన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థల సెలవుల పొడగింపుపై వస్తున్న సస్పెన్స్‌ను సర్కారు ఇంకాస్త పొడగించినట్లుగా అర్థమవుతుంది. శనివారం విద్యాసంస్థల బంద్‌పై వచ్చిన వార్తలకు ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సెలవుల పొడగింపుపై రేపు కీలక నిర్ణయం తీసుకోవచ్చనే తెలుస్తోంది. ఒక వైపు కరోనా.. మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. గత ఏడాది కరోనా విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. స్కూల్స్, కాలేజీలు మూత పడటంతో ఆన్‌లైన్ క్లాసులతో సరిపెట్టుకున్నారు విద్యార్థులు. ఇప్పటికే విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలవులను పొడించే ఆలోచనలో ఉంది. ముందుగా ఈనెల 20వ వరకు సెలవులను పొడగించవచ్చని వార్తలు వినిపించాయి. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉండగానే ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సంక్రాంతి సెలవులను ఈనెల 30వ వరకు పొడగించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై రేపు ఆదివారం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఎక్కువ రోజులు పొడిగించినట్లయితే పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా పాఠాలు బోధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

