జాతీయ సమగ్రతను చాటుదాం..!
– బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం
– ఘర్ ఘర్ తిరంగాలో జాతీయ జెండా ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటింటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమగ్రతను చాటుదామని బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం అన్నారు. ఆదివారం పట్టణంలోని బీజేపీ బూత్ 151, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగారం నర్సింలు ఇంటిపైన ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. బూత్ అధ్యక్షులు సంగమేశ్వర్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశఃం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి భారతీయుడు తన ఇంటిపై జాతీయ జెండా ఆవిష్కరించాలన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమగ్రతను చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ కోశాధికారి ప్రహాల్దాద్ జాదవ్, కోడూరు సంతోష్ కుమార్, గౌడంపల్లి శేఖర్, ప్రభు, రమేష్, చిన్నారులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి..

