మార్వాడి యువమంచ్ సేవలు మరువలేనివి

తాండూరు వికారాబాద్

మంచ్ సేవ‌ల‌కు స‌లాం..!
– వికలాంగులకు కృతిమ అవయవాల పంపిణీ అభినందనీయం
– ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– మార్వాడి యువమంచ్ శిబిరాన్ని సందర్శించిన నేతలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : దివ్యాంగుల కోసం మార్వాడి యువ‌మంచ్ చేసే సేవ‌లకు స‌లాం అంటూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేంద రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానంద, ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్‌లు అభినందించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని బాలాజీ మందిరంలో మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వికలాంగుల శిబిరాన్ని వారు వేరు వేరుగా సందరి ్శంచారు. శిబిరంలో ఉచితంగా జైపూర్ కాళ్లు, కెలిపర్స్ పరికరాలు, కృతిమ అవయవాల అమరికను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్వాడి యువమంచ్ సమాజ హితం కోసం చేసే సేవలు వెలకట్టలేనివన్నారు. వికలాంగులకు చేయూతనందించేందుకు ఉచితంగా జైపూర్ కాళ్లు, పోలియో గ్రస్తులకు కెలిపర్స్ పరికరాలు, కృతిమ అవయవాలు అందజేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, సీనియర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, కౌన్సిలర్ వెంకన్నగౌడ్, బోయ రవి, నాయకులు సిద్రాల శ్రీనివాస్, అజయ్ ప్రసాద్, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉండగా ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, రాజుగౌడ్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులు నర్సిరెడ్డి, పెద్దేముల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, యువనాయకులు తదితరులు ఉన్నారు.

210 మందికి పరికరాల పంపిణీ

మరోవైపు గురు, శుక్రవారాలలో మార్వాడి యువమంచ్ శిబిరంలో 210 మందికి ఉచితంగా జైపూర్ కాళ్లు, కృతిమ అవయవాలను అందజేశారు. 16 మంది వికలాంగులకు కృతిమ అవయవాలు, ఒక అమ్మాయికి మెకానికల్ చేతు, 118 మంది వికలాంగులకు జైపూర్ కాళ్లు, 75 మంది పోలియో గ్రస్తులకు కాలిపర్స్లను అమర్చారు. నాలుగు జతల సంకకట్టెలు పంపీణీ చేవారు. ఈ శిబిరంలో దాదాపు 75 శాతం మంది కొత్తగా కాళ్లు, కృతిమ అవయవాలు అమర్చుకున్నట్లు మంచ్ జాతీయ సభ్యులు మన్మోహన్ సార్థా, కుంజ్ బిహారి సోనిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ చైర్మన్ సునిల్ సార్థా, తాండూరు అధ్యక్షులు సన్ని అగ్రవాల్ తదితరులు పాల్గొన్నారు.