చ‌లి పంజా షురూ..!

తాండూరు వికారాబాద్

క‌మ్మేసిన మంచు దుప్ప‌టి
– తాండూరులో కురిస‌న మంచు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరును మంచు దుప్ప‌టి క‌ప్పేసింది. సోమ‌వారం తెల్ల‌వారు జామునుంచి తాండూరు ప‌ట్ట‌ణంతో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో మంచుకురిసింది. ఉద‌యం 7, 8 గంట‌ల వ‌ర‌కు మంచు ప్ర‌భావం క‌నిపించింది. చ‌లికాలం ప్రారంభం కావ‌డంతో మంచు వ‌ర్షంలా ప‌డింది. ప‌ట్ట‌ణంలోని కాల‌నీలో కురిసిన మంచు వ‌ర్షం ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంది. నిద్ర‌లేసి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌జ‌లు మంచు వ‌ర్షాన్ని ఆస‌క్తిగా తిల‌కించారు. మ‌రోవైపు రోడ్ల‌పై కురవ‌డంతో వాహ‌నదారులు ఇబ్బందులు ప‌డ్డారు. పూర్తిగా తెల్ల‌వారిన త‌రువాత కూడ లారీలు, బైకులు, ఇత‌ర వాహ‌నాలు ముందు ఏమోస్తుందో తెలియ‌కుండా పోవ‌డంతో లైట్లు వేసుకుని న‌డిపించారు.